![]() |
![]() |

వచ్చేసింది.. వచ్చేసింది.. బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.. కానీ ఈ సారి కాస్త త్వరగా రిలీజ్ చేశాడు బిగ్ బాస్ ఎడిటర్ మావ. ప్రతీ వారం ఎప్పుడో అయిదు ఆరుగంటలకి వచ్చే ప్రోమో.. లంచ్ బ్రేక్ ముందే రిలీజ్ చేశాడు.
బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం వీకెండ్ ప్రోమో వచ్చేసింది. మూడో వారం హౌస్ లో ఏం జరిగిందో కనుక్కుందామంటూ మొదలెట్టాడు నాగార్జున. వచ్చీ రాగానే రీతూకి క్లాస్ పీకాడు. నా లక్ బాలేదంటవ్ ఎందుకమ్మా అంటావని రీతూని అడిగాడు. ఆ తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నాం కదా దాని మీద ఎవరు ఉండట్లేదెందుకని క్లాస్ పీకాడు. సంఛాలక్‌గా ఏం చేశావమ్మా అని శ్రీజని నాగార్జున అడుగగా.. కరెక్ట్‌గానే చేశాను సర్ అని గట్టిగానే సమాధానం చెప్పింది. కరెక్ట్‌గా చేశానని నువ్వు అనుకుంటే సరిపోద్దా అని నాగ్ అనేశాడు. కౌంటర్ ఇచ్చారు నాగార్జున. బిగ్ బాస్ చెప్పినట్టే చేశాను సర్ అని శ్రీజ అంది. అసలు నువ్వు చేసిన పని వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యిందన్నాడు.
మన మాస్క్ మ్యాన్ హరీష్ నిల్చోబెట్టి అడిగాడు నాగ్.. లత్కోర్ అనే పదం కాస్త ఇబ్బందికరమైనదని నీకు అనిపించలేదా.. లత్కోర్ హరీష్ అని నాగార్జున అన్నాడు. అది కామన్‌గా వాడేదే కదా అని హరీష్ అనగానే.. అయితే హౌస్‌లో వాళ్లంతా నిన్ను లత్కోర్ హరీష్ అని అంటారు.. నీకు ఓకేనా అని నాగార్జున అడిగాడు. దాంతో హరీష్ సైలెంట్ అయ్యాడు. మరి ఎంతమందికి క్లాస్ పడిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |